బంగారు తెలంగాణలో మరో నిరుద్యోగి ప్రాణాలు వదిలాడు. నిజామాబాదు జిల్లా నవీపేట మండలం తడగామకు చెందిన చందు అనే యువకుడు ఉద్యోగం లేదని మనస్థాపం చెంది ఈనెల 16న పురుగుల మందు తాగాడు. అతడిని చికిత్స కోసం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. క్రమంగా చందు ఆరోగ్యం క్షీణించగా నేడు ఆసుపత్రిలోనే మృతి చెందాడు. అతని మృతి చందు తల్లిదండ్రులకు తీరని బాధను మిగిల్చింది.