ఫ్లాష్ న్యూస్ – చైనాలో మరో కొత్త వైరస్ మరో డేంజర్

ఫ్లాష్ న్యూస్ - చైనాలో మరో కొత్త వైరస్ మరో డేంజర్

0
87

చైనా లో పుట్టి ప్రపంచం అంతా పాకేసింది ఈ కరోనా వైరస్ …ఏకంగా కోటిన్నర మందికి సోకింది, ఇప్పుడు ఆరు లక్షల మరణాలు సంభవించాయి, ఇలా వైరస్ లకు పుట్టినిల్లుగా మారుతోంది చైనా, అయినా ఇంకా అక్కడ వైరస్ లు పుడుతూనే ఉన్నాయి, ప్రపంచాన్ని భయపెడుతున్నాయి, ఇలాంటి దారుణమైన సంక్షోభంలో కూడా మరిన్ని వైరస్ లు చైనాలో గుర్తిస్తున్నారు.

అంతుచిక్కని కొత్త వ్యాధులకు కారణం అవుతున్నాయి.తాజాగా జీ4, బుబోనిక్ వ్యాధులు భయపెడుతున్నాయి. ఈ రెండింటితో పాటుగా కజఖ్ స్థాన్ లోని కొత్త న్యూమోనియా కూడా చైనాను భయపెడుతోంది, ఈ సమయంలో అన్నీ దేశాలు కూడా ఈ జబ్బులు రాకుండా జాగ్రత్త పడుతున్నాయి.

ఇప్పుడు చైనా దేశాన్ని మరొక వ్యాధి భయపెడుతోంది. బద్దె పురుగులాంటి పురుగుల ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తున్నట్టు చైనా గుర్తించింది. ఈ పురుగులు కుట్టిన మనిషి క్రమంగా అనారోగ్యం పాలవుతున్నాడు. ఎలాంటి చికిత్స అందించినా లాభం లేకుండా పోతుందట, దీని గురించి చైనా తెలిపింది, ఇప్పటికే ఐదుగురు ఈ పురుగు కాటుకి మరణించారు ఇవి ఎక్కడైనా ఉంటే వాటిని చంపేస్తున్నారు, ఇంకా 23 మంది ఇవి కుట్టి చికిత్స తీసుకుంటున్నారు.. ఈ వ్యాధికి థ్రాంబోసైటోపెనియా సిండ్రోమ్ అనే పేరు పెట్టారు. జ్వరం నుంచి అనేక తీవ్ర వ్యాధులు వస్తున్నాయట ఇవి కుడితే.