జనసేనలో మరో బిగ్ వికేట్ డౌన్

జనసేనలో మరో బిగ్ వికేట్ డౌన్

0
144

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది… వచ్చే ఎన్నికల నాటికల్లా జనసేన పార్టీపై ప్రజలకు నమ్మకాన్ని పెంచాలని చూస్తున్నారు… అలాంటి సమయంలో పార్టీకి అండగా నిలవాల్సిన నేతలు ఒక్కొక్కరు జారుకుంటున్నారు…

ఇప్పటికే పలువురు నేతలు జనసేనకు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో మరోకీలక నేత జనసేనకు గుడ్ బై చెప్పారు..గత ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేసిన చింతల పార్థసారథి జనసేన పార్టీకి రాజీనామా చేశారు… తన రాజీనామా లేఖను పార్టీ కార్యాలయానికి పంపారు…

గతంలో పార్థసారథి ఘోరంగా ఓటమి చెందినా కూడా పవన్ ఆయనకు కీలక పదవిని అప్పజెప్పారు… కానీ ఆయన కొద్దికాలంగా పవన్ వైఖరిపట్ల అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి… ఈ నేపథ్యంలో ఆయన పార్టీ పదవికి రాజీనామా చేశారు…