ఇక తెలంగాణలో చాలా మంది తమ సొంత ప్రాంతాలకు వెళ్లడానికి అవకాశం లేక ఇక్కడే చిక్కుకుపోయారు.. అలాంటి వారికి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది, ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారు ఇక నుంచి డీజీపీ కార్యాలయం నుంచి పాసులు తీసుకోవాల్సిన అవసరం లేదని తెలంగాణ పోలీసులు తెలిపారు.
అయితే మీరు ఏ స్టేట్ కు వెళుతున్నారో, ఆ స్టేట్ కు సంబంధించి ఆ ప్రభుత్వాలు కొన్ని యాప్స్- వెబ్ సైట్స్ లో మీ వివరాలు నమోదు మాత్రం చేసుకోవాలి అని చెబుతున్నారు, మహరాష్ట్ర, కర్ణాటక , ఏపీకి వెళ్లాలి అని భావిస్తే కచ్చితంగా ఆ యాప్స్ లో మీపేరు డీటెయిల్స్ నమోదు చేసుకోవాలి, ఇక ప్రత్యేక పాసులు ఎవరికి జారీ చేయడం లేదు అని తెలిపింది ప్రభుత్వం.
తెలంగాణకు వచ్చే వాహనాలకు కూడా వాహన పాసులను అడగడం లేదు. అయితే ఏపీకి ఎవరైనా వెళ్లాలి అనుకుంటే స్పందన పోర్టల్ లో రిజిస్టర్ అవ్వాలి, కర్ణాటక రాష్ట్రానికి వెళ్లేవారు సేవా యాప్ లో నమోదు చేసుకోవాలి , మహరాష్ట్రకు వెళ్లే వారు ఆ రాష్ట్ర పోర్టల్లో ప్రయాణికుల వివరాలను నమోదు చేసుకోవాలి అని పోలీసులు తెలిపారు.