కొందరు చేసే పనులు నిజంగా ఆశ్చర్యం కలిగిస్తాయి, ఓ పక్క ప్రపంచం అంతా కోవిడ్ తో బాధపడుతోంది, ఈ సమయంలో బంగ్లాదేశ్ లో ఓ మతపెద్ద అంత్యక్రియలకు 50 వేల మంది హజరవ్వడం అందరిని షాక్ కి గురిచేసింది, దాదాపు అన్నీ దేశాలు కూడా ఈ వార్త విని షాక్ అయ్యాయి, ఇప్పుడు ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇంత మంది బయటకు వచ్చింది లేదు.
దీంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా దీనిపై సీరియస్ అయింది.ఊహించని రీతిలో ప్రజలు రావడంతో పోలీసులు ఏమీ చేయలేకపోయారు. బంగ్లాదేశ్‌లో ఇప్పటికే 2,144 మందికి కొవిడ్-19 సోకగా 84 మంది మృతిచెందారు.
బంగ్లాదేశ్ ఖలీఫత్ మజ్లిస్ నయీబ్ ఈ ఆమిరైన మౌలానా జుబెయిర్ అహ్మద్ అన్సారీ (55) శుక్రవారం సరైల్ ఉపజిలాలోని బెర్తెలా గ్రామంలో మరణించారు. దీంతో మదర్సాలో ఆయన అంత్యక్రియలు జరిగాయి, దీంతో దేశం నలుమూలల నుంచి చాలా మంది వచ్చారు. అంతేకాదు ఎవరూ సోషల్ డిస్టెన్సింగ్ పట్టించుకోలేదు, అంతేకాదు పర్మిషన్ లేకపోయినా అంతమంది హజరయ్యారట.