అంతర్రాష్ట్ర ఆర్టీసీ బస్సులు మ‌రి ఎప్పుడు ?

అంతర్రాష్ట్ర ఆర్టీసీ బస్సులు మ‌రి ఎప్పుడు ?

0
102

ఈ లాక్ డౌన్ స‌మ‌యంలో ఏపీ తెలంగాణ లో చాలా మంది ఒక ప్రాంతానికి వెళ్లి చిక్కుకుపోయిన వారు ఉన్నారు, వారు సొంత ప్రాంతాల‌కు వెళ్ల‌డానికి వారికి ఎలాంటి ర‌వాణా సౌక‌ర్యాలు లేవు, దీంతో వారు చిక్కుకుపోయారు.ఈవారం నుంచి ఆర్టీసీ సర్వీసులు మొదలవుతాయనుకుంటే అధికారులు షాక్ ఇచ్చారు.

అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల ఒప్పందంపై జరగాల్సిన కీలక భేటీ వాయిదా పడింది. అనివార్య కారణాల వల్ల భేటీని వాయిదా వేస్తున్నట్లు రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. అయితే ఆర్టీసీ బ‌స్సులు ఇప్పుడు న‌డ‌పాలా వ‌ద్దా అని ఆలోచ‌న చేస్తున్నారు.

అంతేకాదు ఇప్పుడు ఆర్టీసీ సిబ్బందికి వైర‌స్ సోక‌డంతో కాస్త వెన‌క్కి త‌గ్గిన‌ట్లు తెలుస్తోంది.
మరోవైపు ఈ భేటీ మళ్ళీ ఎప్పుడు జరుగుతుందన్న దానిపై స్పష్టత లేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర నిరాశకు గురయ్యారు.దీనిపై ఏదో నిర్ణ‌యం తీసుకోవాలి అని ప్ర‌జ‌లు కోరుతున్నారు. ఇక జూలైలోనే స‌ర్వీసులు ప్రారంభం అయ్యే అవ‌కాశం ఉంటుంది అంటున్నారు.