ఏపీ, తెలంగాణలో మరో ఎన్నికల సమరం..

AP, another election struggle in Telangana ..

0
101

ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్యే ఎన్నికల కోసం ఉప ఎన్నికలు ముగిసిన వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణలో 6, ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు భారత ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. తెలంగాణలో జూన్‌ 3వ తేదీన ఆరు, ఏపీలో ఈ ఏడాది మే 31న మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయిన విషయం తెలిసిందే. కరోనా విజృంభణ నేపథ్యంలో ఆ సమయంలో ఎన్నికల నిర్వహణను ఈసీ వాయిదా వేసింది.

ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఈ నెల 6వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 16వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 17న నామినేషన్ల స్క్రూటినీ నిర్వహిస్తారు. 22వ తేదీ నామినేషన్ల ఉప సంహరణకు చివరి తేదీగా ఖరారు చేసారు. నవంబర్ 29న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ నిర్వహిస్తారు. డిసెంబర్ 1వ తేదీ లోగా మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.