ఈ ఎన్నికల్లో సొంతగా పోటీ చేసి అత్యధిక సీట్లను గెలుచుకుని కేంద్రంలో రెండో సారి అధికారంలో వచ్చింది బేజేపీ… ఇక 2024 ఎన్నికల నాటికల్లా ఇరు తెలుగు రాష్ట్రాలో బలపడేందుకు ప్రయత్నాలు చేస్తోంది… ఆపరేషన్ ఆకర్షనలో భాగంగా రాజకీయంగా పలుకుబడి ఉన్న నేతలు బీజేపీలో చేర్చుకుంటూ పట్టుసాధిస్తోంది..
ఈ నేపథ్యంలో తెలంగాణకు చెందిన ఇతర నేతలను బీజేపీలో చేర్చుకుని బలపడటమేకాకుండా అధికార టీఆర్ఎస్ పార్టీకి ధీటుగా నిలబడుతోంది… అయితే ఏపీలో మాత్రం వైసీపీకి దీటుగా నిలబడలేకపోతుంది… దీనికి ప్రధాన కారణం ఆ పార్టీలో ఉన్న నేతలు అలాగే టీడీపీ నుంచి బీజేపీలోకి చేరిన నేతలే కారణం అని అంటున్నారు.
టీడీపీతో చెడి ఏపీలో సొంతంగా పోటీ చేసిన బీజేపీ పరోక్షంగా వైసీపీకి సపోర్టు గా నిలిచిందని వార్తలు వచ్చాయి కానీ వైసీపీ స్వతహాగా అత్యధిక సీట్లను సాధించుకుంది… దీంతో టీడీపీ ప్రతిపక్షంలో చేరడంతో టీడీపీ నేతలు బీజేపీలో చేరారు. దీంతో టీడీపీ నేతలు వైసీపీని విమర్శించడం మొదలు పెట్టారు. వీరు చేరిక ముందు చాలా మంది బీజేపీ నాయకులు వైసీపీకి సపోర్టు చేస్తూ వచ్చేవారు. కానీ బీజేపీలోకి చేరిన టీడీపీ నేతలు వైసీపీని విమర్శించడం మొదలు పెట్టారు దీంతో బీజేపీలో రెండు పార్టీల ఎజెండాగా నడుస్తోందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.