ఏపీ బీజేపీ అధ్యక్షుడు ఆయనేనా?

ఏపీ బీజేపీ అధ్యక్షుడు ఆయనేనా?

0
86

ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు రావడం పక్కా అనే చెప్పాలి, ఇప్పటికే పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి, అయితే కన్నా లక్ష్మీనారాయణ వల్ల బీజేపీ పెద్దగా సాధించింది ఏపీలో ఏమీ లేదు అని భావించారు బీజేపీ నేతలు. ఇక జనసేన బీజేపీ కలవడంతో కొత్త నాయకుడికి బీజేపీ బాధ్యతలు ఇవ్వాలి అని చూస్తున్నారు అధిష్టానం పెద్దలు.

ఇటీవల . బీజేపీ నేత నేత విద్యాసాగర్ రావు చేసిన వ్యాఖ్యలతో రాష్ట్రంలో ఆశావహుల ఆశలు రెట్టింపయ్యాయి. ఇక కన్నాని మరో రెండు సంవత్సరాలు ఈ పదవిలో కంటిన్యూ చేస్తారని వార్తలు వచ్చాయి కాని అవి వాస్తవం కాలేదు,
ముఖ్యంగా ఎమ్మెల్సీ మాధవ్ తనకున్న ఆర్ఎస్ఎస్ బలంతో ఢిల్లీలో ఈ మధ్యన ఎక్కువగా గడుపుతున్నారనే ప్రచారం జరుగుతోంది.

ఇక ఆయనకు బీజేపీ నేతల సపోర్ట్ ఉంది ఆరెస్సెస్ సపోర్ట్ ఉంది అందుకే ఆయనకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట
మాధవ్ తండ్రి ఉమ్మడి రాష్ట్రంలో అధ్యక్షుడిగా పనిచేయడం, ఆర్ఎస్ఎస్ మద్దతుతో పాటు సుజనా, సీఎం రమేశ్ సపోర్టు కూడా ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.