ఏపీ కేబినెట్ నిర్ణయాలు ఇవే పంచాయతీ ఎన్నికలపై ప్రకటన

ఏపీ కేబినెట్ నిర్ణయాలు ఇవే పంచాయతీ ఎన్నికలపై ప్రకటన

0
100

ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ అధ్యక్షతన కాబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ విషయాలు మీడియాకు మంత్రి పేర్ని నాని వెల్లడించారు.

1.. మార్చ్ 15లోగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు, అలాగే నోటిఫికేషన్ వెలువడిన తర్వాత 15 రోజుల్లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేలా చట్టంలో మార్పులు తీసుకురానున్నారు.

2.. ఈ ఎన్నికల్లో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటారట. డబ్భు, మద్యం ప్రమేయం లేకుండా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

3..ఒక వేళ స్ధానిక సంస్ధల ఎన్నికల జరిగే సమయంలో అక్రమాలకు పాల్పడే వారిపై అనర్హత వేటు వేస్తామని… గరిష్టంగా మూడేళ్ళ వరకు జైలు శిక్ష కూడా పడేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

4. ఇక ఎన్నికల ప్రచారాంలో కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు…పంచాయతీ ఎన్నికలకు 5 రోజులు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు 8 రోజులు ప్రచారం నిర్వహించాలని తెలిపారు. ఇక గిరిజన ప్రాంతాల్లో గిరిజనులే ఎన్నికల్లో నిలబడేలా మార్పులు తీసుకువస్తున్నారు

5..ఏపీ స్టేట్ అగ్రికల్చర్ కౌన్సిల్, ఏపీ స్టేట్ ఫైనాన్సియల్ లిమిటెడ్ ఏర్పాటుకు కాబినెట్ ఆమోదం

6..జెన్ కో ఆధ్వరంలో 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కేబినెట్ ఆమోదించింది

7. ఇక కేబినెట్ భేటీ ముగిసింది.. సీఎం జగన్ హస్తిన వెళ్లనున్నారు, అక్కడ మూడు రాజధానుల అంశం అలాగే శాసనమండలి రద్దు పైకేంద్రంతో చర్చించనున్నారు.