మళ్లీ లాక్ డౌన్ లోకి ఏపీ రాజధాని….

మళ్లీ లాక్ డౌన్ లోకి ఏపీ రాజధాని....

0
82

విజయవాడలో చాలా రోజుల తర్వాత మరోసారి లాక్ డౌన్ విధించేకు అధికారులు సిద్దమయ్యారు… నగరాన్ని కంటైన్ మెంట్ జోన్లుగా విభజించి లాక్ డౌన్ ఆంక్షలు అమలు చేయబోతున్నారు.. ఇందుకోసం ప్రధాన మార్గాలతో పాటు చిన్నా చితకా రోడ్లలకు బారికేడ్లు వేస్తున్నారు… గత కొన్ని రోజులుగా నగర వ్యాప్తంగా పెరుగుతున్న కేసులను బట్టి చూస్తే పరిస్థితి తీవ్రమవుతుందని అధికారులు చెబుతున్నారు..

దీంతో లాక్ డౌన్ విధించక తప్పని పరిస్థితులు నెలకొంటున్నాయి.. ఈమేరకు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు… విజయవాడలో కొంతకాలంగా కరోనా వ్యాప్తి ఓ మోస్తారుగా ఉన్నటికీ తాజాగా ఇది బాగా పెరిగింది… నిత్యం వందలసంఖ్యలో కేసులు నమోదు అవుతుండటం నిన్న ఒక్క రోజే జిల్లా వ్యాప్తంగా దగ్గర దగ్గర నాలుగువందలకు చేరువలో కేసులు నమోదు అయితే ఇందులో అత్యధికంగా విజయవాడలోనే ఉన్నాయి…

దీంతో అధికారులతో పాటు సాధారణ ప్రజల్లోనూ భయాందోళనలు నెలకొంటున్నాయి… వైరస్ కారణంగా గత 20 గంటల్లోనే 8 మంది చినిపోయారు… ముఖ్యంగా నగరంలోని స్లమ్ ఏరియాల్లో వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది… దీంతో అధికారులు నేటినుంచి కఠిన ఆంక్షలకు సిద్దమవుతోంది…