ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి పవన్ మూడు పెళ్ళిళ్ల ప్రస్తవన తెరపైకి తీసుకువచ్చారు… అయ్యా పవన్ కళ్యాణ్ మీరు మూడు పెళ్ళిళ్లు చేసుకున్నారు… బహుషా నలుగురు లేక ఐదుమంది పిల్లలు పుట్టింటి ఉంటారు వారిని ఏ మీడియంలో చదివిస్తున్నారని జగన్ ప్రశ్నించారు…
దీనిపై జనసేన పార్టీ ముఖ్యనేత మాజీ స్పీకర్ నాదేండ్ల మనోహర్ స్పందించారు… జగన్ చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ కార్యకర్తలు కాస్త సమ్యమనం పాటించాలని అన్నారు… భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా పవన్ పోరాటం చేస్తున్నారు దాన్ని పక్కదోవ పట్టించేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని నాదేండ్ల మనోహర్ అన్నారు…
పవన్ ప్రభుత్వ పాలసీల గురించి మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిగత విమర్శల గురించి మాట్లాతున్నారని ఆయన ఆరోపించారు…