ఢిల్లీ టూర్ కు ఏపీ సీఎం జగన్..రేపు ప్రధాని మోడీతో భేటీ

0
106

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్ ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానితో భేటీ కానున్నారు. ఇందులో భాగంగా సాయంత్రం 6.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 7 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీ పయనం కానున్నారు సీఎం. అలాగే రాత్రి 9.15 గంటలకు ఢిల్లీ చేరుకుని రాత్రికి 1 జన్‌పథ్‌ నివాసంలో బస చేయనున్నారు. రేపు ఉదయం 10.15 ప్రాంతంలో ప్రధాని నరేంద్రమోదీతో సీఎం జగన్ భేటీ కానున్నట్లు తెలుస్తుంది. ఈ భేటీలో  పోలవరం ప్రాజెక్టుతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధుల అంశంపై మోదీకి వినతిపత్రం సమర్పించనున్నారు జగన్‌.