ఏపీ సీఎం జగన్ సంచలన ప్రకటన..రాష్ట్రంలో ఇకపై అవి బ్యాన్!

0
95

ఏపీ సీఎం జగన్ సంచలన ప్రకటన చేశారు. నేడు విశాఖలో నిర్వహించిన మెగా బీచ్ క్లీనింగ్ ప్రోగ్రాంలో పాల్గొన్న సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇక నుంచి ప్లాస్టిక్ బ్యానర్లు కనిపించకూడదని స్పష్టం చేశారు. క్లాత్‌తో తయారు చేసిన పోస్టర్లు మాత్ర కట్టాలన్నారు. ఖర్చు ఎక్కువైనా క్లాత్ పోస్టర్లు, బ్యానర్లు వాడాలని నిర్ణయించారు.

కాగా, ఇవాళ విశాఖలో నిర్వహించిన మెగా బీచ్ క్లీనింగ్ ప్రోగ్రాం సక్సెస్ అయింది. ఆర్కే బీచ్‌ నుంచి భీమిలి వరకు సుమారు 28 కిలోమీటర్ల పొడవునా సాగరతీరంలో ప్లాస్టిక్, ఇతర వ్యర్థాల్ని సేకరించే కార్యక్రమాన్ని నిర్వహించింది. పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే.. ఆర్థిక పురోగతి సాధించాలన్నారు.

మరోవైపు పార్లే ఫర్‌ ది ఓషన్స్‌తో ఆంధ్రప్రదేశ్‌ సర్కార్‌ కీలక ఒప్పందం చేసుకుంది. ఏపీలో సముద్ర తీరాన్ని ప్లాస్టిక్ ఫ్రీగా మార్చేందుకు.. పార్లే ఫర్ ది ఓషన్స్ ముందుకు వచ్చింది. రాష్ట్రంలో 16 వేలకోట్ల పెట్టుబడులు పెట్టబోతోంది పార్లే సంస్థ. దీని ద్వారా 20 వేల మందికి ఉపాధి లభించనుంది.