ఏపీ సీఎం అత్యవసర భేటీ.. అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశం

ఏపీ సీఎం అత్యవసర భేటీ.. అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశం

0
89

ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అమెరికా పర్యటన ముగించుకుని స్వరాష్ట్రానికి విచ్ఛేసిన విషయం విదితమే. ఈ సందర్బంగా అందుబాటులో ఉన్న మంత్రులతో జగన్ అత్యవసరంగా సమావేశం కానున్నారు. సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై నిశితంగా చర్చించనున్నారు.
ముఖ్యంగా తిరుమలలో బాస్ టికెట్స్ పై అన్యమత ప్రచారం వివాదం, పోలవరం, వరద పరిత్సితులపై సమావేశం చర్చించుకున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటె తిరుమలలో కలకలం రేపిన అన్యమత ప్రచారం వ్యవహారంపై సీఎం కు మంత్రి పేర్ని నాని వివరించనున్నారు. కాగా ఇప్పటికే ఈ అంశంపై మంత్రి మీడియా సమావేశాన్ని రద్దు చేసుకున్నారు. సీఎంకు నిశితంగా వివరించిన అనంతరం అయన సూచనల మేరకు మీడియాతో నాని మాట్లాడనున్నారు.