ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మ‌రో కీల‌క నిర్ణ‌యం

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మ‌రో కీల‌క నిర్ణ‌యం

0
97

ఈరోజుల్లో ఏదైనా జ్వ‌రం లేదా ఒంట్లో న‌ల‌త ఉంటే వెంట‌నే వెళ్లి మందుల దుకాణంలో మందు తెచ్చుకుంటాం, కాని ఒక్కోసారి అవి మంచివి కాక‌పోవ‌డంతో ప్ర‌జ‌ల ప్రాణాల‌ను కూడా హ‌రిస్తున్నాయి..
అయితే ఇలాంటి న‌కిలీ మందులు అమ్మేవారికి ఇక ఏపీ స‌ర్కార్ చెక్ పెడుతోంది.
ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు కొంద‌రు న‌కిలీ మెడిక‌ల్ కేటుగాళ్లు.

ఇలాంటి వారిని మీరు గుర్తించినా ఇలాంటి మందులు త‌యారు అవుతున్నాయి అని మీకు తెలిసినా వెంట‌నే ప్ర‌భుత్వానికి తెలియ‌చేస్తే ఏపీ ప్ర‌భుత్వం మీకు రివార్డులు ఇవ్వాలని భావించింది, తాజాగా సీఎం జ‌గ‌న్ దీనిపై నిర్ణ‌యం తీసుకున్నారు

ఇలాంటి కంపెనీల‌ను కేటుగాళ్ల‌ని అరెస్ట్ చేయ‌డంతో పాటు వారి లైసెన్స్ లు ర‌ద్దు చేస్తారు,
డ్రగ్ కంట్రోల్‌లో విజిలెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. డ్రగ్ తయారీ యూనిట్లలో నాణ్యతపై దృష్టి సారించడమే కాకుండా భారీ జరిమానాలు విధించేలా కఠినమైన నిబంధనలను అమలులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఇక స‌ర్కారు ఆస్ప‌త్రిలో కూడా క‌చ్చితంగా చెకింగ్ జ‌ర‌గాలి అని తెలిపారు.