ఏపీ రాజధానిపై లక్షల మంది షేర్ చేస్తున్న పోస్ట్ ఇదే వైరల్

ఏపీ రాజధానిపై లక్షలమంది షేర్ చేస్తున్న పోస్ట్ ఇదే వైరల్

0
82

ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మూడు రాజధానుల ప్రకటనపై కొందరు విమర్శలు చేస్తుంటే మరికొందరు ప్రశంసలు చేస్తున్నారు, ఇక ఇప్పుడు అంతా ఏ విషయం మీద అయినా స్పందించాలి అన్నా ట్విటర్ ఫేస్ బుక్ ఇలా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారానే కామెంట్స్ స్పందన ఉంటున్నాయి.
ఈనేపథ్యంలో వైరల్ అవుతోంది ఓ పోస్ట్ మరి అది ఏమిటో చూద్దాం.

ఆంధ్రా పొడవునా సముద్రం వుంది కాబట్టి, అసెంబ్లీ ప్రభుత్వ కార్యాలయాలు ఒక రెండు పెద్ద టైటానిక్ లాంటి షిప్స్ లో పెట్టి శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు నెలకు ఒకసారి అటూ ఇటూ తిప్పితే, రాజధాని అందరి దగ్గరకూ వచ్చినట్టుంది ప్లస్ ఒక ఫ్లోటింగ్ కాపిటల్ గా ప్రపంచంలో గుర్తింపు వస్తుంది. ఎవరి భూములూ, రియల్ ఎస్టేట్లు అవసరం లేదు. ఏమంటారూ? అనేదే ఆ పోస్ట్.

అయితే కావాలనే కొందరు అధికార పార్టీపై విమర్శలు చేస్తూ ఇలాంటి పోస్టులు పెడుతున్నారని, తీవ్రస్ధాయిలో విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫేస్ బుక్ వాట్పాప్ ట్విటర్ లో పెద్ద ఎత్తున దీనిని షేర్ చేస్తున్నారు. దీనిపై వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు.