ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాష మత ప్రార్థనలకు వెళ్లడంపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు…

ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాష మత ప్రార్థనలకు వెళ్లడంపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు...

0
102

ఢిల్లీ నిజాముద్దీన్ పేరు చెబితే ప్రస్తుతం యావత్ భారతదేశం వణికిపోతుంది… ఇక్కడ మర్కజ్ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన ఇరు తెలుగు రాష్ట్రాల వారికి ఎక్కువగా కరోనా సోకింది.. వీరిలో తెలంగాణకు చెందిన ఆరుగురు మరణించారు దీంతో అందరు భయపడుతున్నారు… అలాగే ఢిల్లీనుంచి ఏపీకి తిరిగి వచ్చిన వారిలో సుమారు 21 మంది కరోనా సోకింది…

ఇది ఇలా ఉండగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కడప ఎమ్మెల్యే అంజాద్ బాష కూడా నిజాముద్దీన్ మత ప్రార్థనలకు వెళ్లారనే వార్తలు హల్ చేస్తోంది… దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు… కొంతమంది తనపై ఉద్దేశ పూర్వకంగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు….

వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు… తాను మార్చి నెల 2వ తేదీన ముస్లీంలకు వైఎస్సార్ ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్ కేసు విషయమై ఢిల్లీకి వెళ్లానని తెలిపారు… అక్కడ మత ప్రార్థనలకు వెళ్లినట్లు దుష్ర్పచారం చేస్తున్నారని ఆరోపించారు..