ఏపీ ప్రభుత్వం శుభవార్త..వారికీ త్వరలో గుర్తింపు కార్డులు

0
104

జగన్ సర్కార్ వరుస శుభవార్తలతో ప్రజలకు ఆనందపరుస్తున్నారు. జగన్ సీఎం అయిన్నప్పటి నుండి తన మార్క్ చుపెట్టుకుంటున్నాడు. అంతేకాకుండా వినూత్నమైన మార్పులు చేస్తూ ఏపీని అభివృద్ధి చేస్తున్నాడు. ఇటీవలే కొత్త క్యాబినెట్ లో మంత్రులను వివిధ శాఖల్లో కేటాయించిన సంగతి తెలిసిందే. ఏపీ పర్యాటక శాఖ, సాంస్కృతిక, యువజన శాఖల మంత్రిగా రోజా ప్రమాణ స్వీకారం చేసిన విషయం కూడా అందరికి తెలిసిందే.

ప్రస్తుతం మంత్రి రోజా ఏపీ ప్రజలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఈ మేరకు రోజా కళాకారులందరికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా అందరినీ ప్రోత్సహించేలా అన్నికార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించారు. ఇందు కోసం మార్గదర్శకాలు కూడా సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి రోజా.

దేశంలో మొదటి సారిగా ఆధునిక టెక్నాలజీతో నిర్వహిస్తున్న బాపు మ్యూజియం ఏలూరు, అనంతపురం మ్యూజియాల లాగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. అంతేకాకుండా పాఠశాలలో చదువుకునే విద్యార్థులు కూడా చరిత్ర గొప్పతనం మీద అవగాహనా కల్పించడానికి బాపు మ్యూజియం టూర్స్ ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. రూ.12,800కోట్లతో తమ ప్రభుత్వం దీనిని ఆధునీకరించారని మంత్రి రోజా తెలిపారు.