ఏపీ ప్రభుత్వం శుభవార్త.. రైతులకు మైక్రో ఇర్రిగేషన్ వెసులుబాటు

0
73

జగన్ సర్కార్ వరుస శుభవార్తలతో ప్రజలకు ఆనందపరుస్తున్నారు. జగన్ సీఎం అయిన్నప్పటి నుండి తన మార్క్ చుపెట్టుకుంటున్నాడు. అంతేకాకుండా వినూత్నమైన మార్పులు చేస్తూ ఏపీని అభివృద్ధి చేస్తున్నాడు. ప్రస్తుతం ఏపీ రైతులకు సీఎం జగన్‌ అదిరిపోయే శుభవార్త చెప్పారు. కొత్త కేబినెట్ లో వ్యవసాయ శాఖ మంత్రిగా కాకాణి గోవర్ధన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.

అయితే నూతనంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన మొదటి లక్షంగా రైతులకు ఏదైనా లాభం చేకూరే పని చేయాలనీ నిర్ణయించుకున్నటున్నారు. ఏపీ రైతులకు లబ్ది చేకూరుతుందనే ఉద్దేశ్యంతో..కాకాణి గోవర్ధన్‌రెడ్డి రూ.1,395 కోట్లతో 3.75 లక్షల ఎకరాలకు మైక్రో ఇర్రిగేషన్ అవకాశం కల్పించే ఫైలుపై మొదటి సంతకం చేశారు.

అంతేకాకుండా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ తో ఎలాంటి వాగ్వాదాలు లేవని ప్రకటించారు. ఇవన్నీ మీడియా సృష్టించిన ప్రగల్బాలని తెలిపారు. ప్రస్తుతం వైసీపీ నేత‌లు అంద‌రూ ఒకే తాటి పై నడుస్తున్నట్టు తెలిపారు. అధికారంలోకి వచ్చాక తొలి మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న అనిల్‌తో కలిసి జిల్లా అభివృద్ధికి కృషిచేశామని కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు.