ఏపీ ప్రభుత్వం శుభవార్త..త్వరలో పంట నష్టం పరిహారం పంపిణీ

0
100

జగన్ సర్కార్ వరుస శుభవార్తలతో ప్రజలకు ఆనందపరుస్తున్నారు. జగన్ సీఎం అయిన్నప్పటి నుండి తన మార్క్ చుపెట్టుకుంటున్నాడు. అంతేకాకుండా వినూత్నమైన మార్పులు చేస్తూ ఏపీని అభివృద్ధి చేస్తున్నాడు. ఇటీవలే కొత్త కేబినెట్ లో వ్యవసాయశాఖ మంత్రిగా కాకాణి గోవర్దన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి ఏపీ రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పాడు. జూన్ 15లోపు పంట నష్ట పరిహారం పంపిణీ చేయాలని మంత్రి నిర్దారించి ఆదేశాలు జారీ చేసారు. మే 16న వైఎస్ ఆర్ రైతు భరోసా నిధులు విడుదల చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. జూన్ 3 వేల ట్రాక్టర్లు సహా 4014 వ్యవసాయ పరికరాలు కూడా పంపిణీ చేయాలని మరోసారి స్మృతికి తెచ్చారు మంత్రి.

చంద్రబాబు లాగా జగన్ పన్నులు వేయలేదని స్పష్టం చేసారు. అంతేకాకుండా ప్రజలకు ఎల్లప్పుడూ ఏదైనా సహాయం చేయాలనీ ఆలోచించే మనస్తత్వం జగన్నకు ఉందని పేర్కొన్నారు. కానీ చంద్రబాబు మాత్రం సంక్షేమ పథకాలు, అభివృద్దికి భంగం కలిగించని ఆలోచిస్తాడని మండిపడ్డాడు. ఎన్నికల్లో వైసీపీని ఢీకొనే ధైర్యం కూడా లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసాడు.