ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..సినిమా టికెట్ల విక్రయంలో జీవో నెం.142 జారీ

AP government has taken a key decision..Jivo No.142 has been issued in the sale of movie tickets

0
114

ఏపీలో సినిమా టికెట్ల విక్రయాలు ప్రభుత్వం ద్వారానే జరిగే విధంగా ప్రభుత్వం జీవో జారీ చేసింది. జీవో నెం. 142 ప్రకారం టికెట్ల అమ్మకాలన్నీ ప్రభుత్వ పరిధిలోనే జరుగుతాయని స్పష్టం చేసింది. ఈ బాధ్యతను ఏపీఎస్‌ ఎఫ్‌టీవీటీడీసీ (ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఫిల్మ్‌ టెలివిజన్ థియేటర్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌)కి అప్పగించింది.

సినిమా టికెట్ల ధరలకు సంబంధించిన వివాదం సద్దుమణగకముందే ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే సినిమా టికెట్‌ ధరల నిర్ణయం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైన సంగతి తెలిసిందే. టికెట్‌ రేట్లను తగ్గించాలంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 35ను సస్పెండ్‌ చేస్తూ హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది.

అయితే.. కేవలం పిటిషన్‌ దాఖలు చేసిన వారికి మాత్రమే టికెట్‌ రేట్లు పెంచుకునే అవకాశం ఉంటుందని మిగిలిన అన్ని థియేటర్‌లలో ప్రభుత్వం నిర్ణయించిన ధరకే టికెట్లు అమ్మాలని రాష్ట్ర హోంశాఖ వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా జీవో నెం.142ను తీసుకురావటం విశేషం.