ఏపీ ప్రభుత్వం శుభవార్త..ఇల్లు కట్టుకునే వారికి 3 లక్షల రుణాలు మంజూరు!

0
99

జగన్ సర్కార్ ప్రజలకు మరో శుభవార్త చెప్పింది. జగనన్న కాలనీల్లో పెద్దగా ఇళ్లు కట్టుకోవాలని అనుకునే వారి కలలు నెరవేర్చుకోవడానికి మంచి అవకాశం ఇస్తుంది జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్. అతి తక్కువ వడ్డీకే రుణాలు మంజూరు చేస్తుంది.

ఇళ్లు కట్టుకోవాలనుకునేవారికి రూ.3 లక్షల అతి తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వనున్నట్లు తాజాగా ప్రకటన చేసింది ఏపీ సర్కార్‌. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గృహ నిర్మాణ మత్రి చెరుకువాడ శ్రీ రంగ నాథ రాజు, శాసన మండలి ఛైర్మన్‌ కొయ్యే మోషేన్‌ రాజు శ్రీకారం చుట్టారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన కార్యక్రమంలో ఐఐఎఫ్ఎల్ సంస్థ ప్రతినిధులతో కలిసి లబ్ధిదారులకు రుణ మంజూరు పత్రాలను అందజేశారు. 5, 8, 10 సంవత్సరాల కాల వ్యవధిలో తీసుకున్న అప్పు, వడ్డీ కలిపి ప్రతి నెలా చెల్లించాలని తెలిపారు.