సాయి తేజ కుటుంబానికి ఏపీ సర్కార్ సాయం

AP govt helps Sai Teja family

0
91

తమిళనాడులో జరిగిన హెలిక్టాప్టర్‌ ప్రమాదంలో అమరుడైన చిత్తూరు జిల్లా వాసి లాన్స్‌నాయక్‌ సాయితేజ్‌ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. రూ.50లక్షల సాయం అందించాలని సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం ట్విటర్‌ ద్వారా ప్రకటించింది.

అతని భౌతికకాయం నేడు స్వగ్రామం ఎగువరేగడికి తీసుకురానున్నారు. భౌతికకాయం రావడం ఆలస్యమైతే రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సాయి తేజ దేశ సేవలో తరించాలన్న సంకల్పంతో.. ఎంతో శ్రమించి కలలను సాకారం చేసుకున్నారు. పారా కమాండోగా చెరగని ముద్రవేసి.. త్రిదళాపతి బిపిన్ రావత్‌ను సైతం మెప్పించారు.

సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌కు సాయితేజ్‌ పర్సనల్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పని చేశారు. ఈ క్రమంలో సీడీఎస్‌ దంపతులు, సాయితేజ సహా మరో 11 మంది హెలికాప్టర్‌లో వెళ్తుండగా ఘోర దుర్ఘటన జరిగింది.