Flash: అక్రమ లే అవుట్లపై సర్కార్ సంచలన నిర్ణయం

0
66

రియల్‌ వెంచర్లు, అక్రమ లేఅవుట్లకు చెక్  చెప్పేందుకు ఏపీ సర్కారు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు అక్రమ లేఅవుట్ల రిజిస్ట్రేషన్లను నిషేధిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. డీటీసీపీ అనుమతి లేని అవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ చేయవద్దని స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ డీఐజీలు, జిల్లా రిజిస్ట్రార్లకు ఆదేశించింది.  ఈ ఆదేశాలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది.