ఏపీ సర్కార్ సంక్షేమ పథకాలతో దూసుకుపోతోంది. అంతేకాదు విద్యార్థుల భవిష్యత్తుపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. వారి భవిష్యత్తుపై ఎంతో కేర్ తీసుకుంటోంది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది సర్కార్.
రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల చుట్టూ కలుషిత వాతావరణం లేకుండా ఉండేందుకు చర్యలకు శ్రీకారం చుట్టింది.
ప్రభుత్వ స్కూల్‌కు 200 మీటర్ల దూరం వరకు గుట్కా, పాన్, సిగరెట్‌లు అమ్మే షాపులు ఉండకూడదు, తాజాగా వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఇక అక్కడ ఉన్న ANMలు వీటిని పర్యవేక్షిస్తారు. ఒక్కో ANM కి
మూడు పాఠశాలల బాధ్యతలు అప్పగిస్తారు.
దీనికోసం ఒక ప్రత్యేక యాప్‌ను తయారు చేశారు. ఈ యాప్ ద్వారా అక్కడి ఫొటోలు తీసి అప్‌లోడ్ చేయాలి. ఇక అక్కడ ఉన్న షాపుల్లో సిగరెట్లు గుట్కాలు అమ్మితే వారిపై కేసులు పెడతారు. స్కూల్ దగ్గర స్మోకింగ్ చేయడం, గుట్కాలు తినడం చేసినా కేసులు పెడతారు. ఇక స్కూళ్ల దగ్గర మద్యం షాపులు అస్సలు ఉండకూడదు. చెడు అలవాట్ల ప్రభావం చిన్నపిల్లలపై పడకూడదని ఈ చర్యలు చేపట్టారు. ఇక టీచర్లు ఎవరైనా స్కూల్ ఆవరణలో స్మోకింగ్ చేస్తే వారిపై కూడా చర్యలు ఉంటాయి.