ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం…

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం...

0
93

అమరావతి నుంచి కార్యాలాయల తరలింపును సవాల్ చేస్తూ వేసిన పిటీషన్ల పై ఈ రోజు ఏపీ హైకోర్టు విచారించింది.. దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది న్యాయస్థానం..

అలాగే వాదనలకు సంబంధించిన డాక్యుమెంట్స్ ను కూడా ఇవ్వాలని పిటీషనర్లను ఆదేశించింది కోర్ట్.. డాక్యుమెంట్లు లేకుండా ఓరల్ ఆర్గ్యుమెంట్స్ చేయడం సరికాదని కోర్టు తెలిపింది…

ఏ కారణాలతో ఆపీసులను తరలిస్తున్నారో అఫిడవిట్ దాఖలు చేయాలని కోరింది… తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది… కాగా నిన్న కూడా డాక్యుమెంట్లకు సంబంధించి విచారణ జరిపింది న్యాయస్థానం