ఎంపీ రఘురామరాజుపై విచారణకు ఏపీ హైకోర్టు అనుమతి..కానీ..

0
91

ఎంపీ రఘురామరాజుపై నమోదైన సీఐడీ కేసులో విచారణకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. కాగా తనపై కేసులను కొట్టివేయాలని హైకోర్టులో రఘురామరాజు పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో రఘురామరాజును రాజద్రోహం నేరం మినహా మిగతా సెక్షన్‍ల కింద విచారించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.

అంతేకాదు దీనిని హైదరాబాద్ దిల్‍కుషా గెస్ట్ హౌస్‍లో లాయర్ సమక్షంలో విచారించాలని కోర్టు ఆదేశించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ విచారణ చేయాలని, కేసుకు సంబంధించిన అంశాలు మినహా.. ఏ ఇతర అంశాలపై పిషనర్‍ను ప్రశ్నించకూడదని స్పష్టం చేసింది. అయితే సీఐడీ కార్యాలయాలకు పిలిపించవద్దని, విచారణ అంతా లాయర్ సమక్షంలోనే జరగాలని, కోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తే.. బాధ్యులైన పోలీస్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సొస్తుందని ఏపీ హైకోర్టు హెచ్చరించింది.