ఇళ్ల పట్టాల పంపిణీకి అధికారికంగా డేట్ ఫిక్స్ చేసిన సీఎం జగన్

ఇళ్ల పట్టాల పంపిణీకి అధికారికంగా డేట్ ఫిక్స్ చేసిన సీఎం జగన్

0
84

కృష్ణా జిల్లా గాజులపేటలో జగనన్న పచ్చతోరణం కార్యక్రమం ఏర్పాటు చేశారు… ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హజరై మొక్కను రావిచెట్టు వేపచెట్టును నాటారు….. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ… పేదలకు ఇళ్లపట్టాలు ఇస్తుంటే టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు…

ఇళ్ల పట్టాలకోసం సుప్రీం కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి టీడీపీ నేతలు తెస్తున్నారని మండిపడ్డారు… రానున్న రోజుల్లో మంచి రోజులు వస్తాయని… వచ్చే నెల ఆగస్టు 15న 15 లక్షలమందికి ఇళ్ల పట్టాలు అందిస్తామని స్పష్టం చేశారు… ఇళ్లులేని ప్రతీ నిరుపేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు