పీఆర్సీపై స్పందించిన ఏపీ ఉద్యోగ సంఘాలు..ఏమన్నారంటే

AP job unions responding to PRC

0
93

పీఆర్సీతో పాటు ఫిట్​మెంట్​పై ఏపీ ప్రభుత్వం వెల్లడించిన వివరాలపై ఉద్యోగ సంఘాలు స్పందించాయి. కేంద్ర ప్రభుత్వ స్కేల్స్ అమలుకు తాము వ్యతిరేకమని ఏపీ ఎన్జీవోల సంఘ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు అన్నారు. తమ సమస్యలు సీఎం వద్ద మాత్రమే పరిష్కారం అవుతాయని భావిస్తున్నామని చెప్పారు.

కేంద్రం అమలుచేసే పీఆర్‌సీ తమకు ఇవ్వడం సరికాదని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. కేంద్ర ఉద్యోగుల స్కేళ్లకు, తమ స్కేళ్లకు తేడా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఫిట్‌మెంట్ పెంచాలని సీఎం జగన్‌ను కోరతామన్నారు.