ఇప్పటి వరకూ రెండు నెలల్లో కచ్చితంగా పాస్ లు ఉంటేనే ఏపీ నుంచి మిగిలిన రాష్ట్రాలకు అలాగే మిగిలిన స్టేట్స్ నుంచి ఏపీకి పాస్ లు జారీ చేశారు పోలీసులు , అయితే తాజాగా ఎవరైనా ఏపీకి రావాలి అంటే మాత్రం కచ్చితంగా పాస్ లు జారీ చేస్తాము అంటున్నారు పోలీసులు. ఇక ముఖ్యమైన పనులు నిమిత్తం బయటకు వెళ్ళేవారికి మాత్రమే పాస్లు జారీ చేయనున్నారు.
ఈ మేరకు పోలీస్ శాఖ పలు సూచనలు చేసింది. వైద్య చికిత్స, కుటుంబంలో మరణం, సామాజిక పనులు, ప్రభుత్వ విధి నిర్వహణ తదితర అత్యవసర పనులపై ప్రయాణించాలనుకునే వారికి ఈ-పాస్లు జారీ చేయనున్నట్టు పోలీస్ శాఖ తెలిపింది.
ఈ-పాస్ల కోసం https:citizen.appolice.gov.in అనే వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనిలో అప్లై చేస్తే మీకు మొబైల్ అలాగే మెయిల్ ఐడీకి రూట్ పాస్ వస్తుంది. దీనికి ఏమి ఇవ్వాలి అంటే
డాక్యుమెంట్లు
1) పాస్పోర్ట్ సైజ్ ఫోటో
2) ప్రయాణించేవారి వివరాలు
3) ప్రయాణించే వారి ఐడీ ప్రూఫ్స్
4) మెయిల్ ఐడీ
5) అవసరమైన సంబంధిత డాక్యుమెంట్లు
6) మొబైల్ నంబర్
7) వాహనానికి సంబంధించిన వివరాలు