ఏపీకీ వెళ్లాలనుకుంటే కచ్చితంగా ఇలా చేయాల్సిందే

ఏపీకీ వెళ్లాలనుకుంటే కచ్చితంగా ఇలా చేయాల్సిందే

0
85

తెలంగాణ నుంచి ఏపీకి రావాలి అని అనుకున్న వారికి సోమవారం నుంచి చెక్ పోస్టులు ఎత్తేస్తారు అని వార్తలు వచ్చాయి, అయితే దీనిపై తాజాగా క్లారిటీ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం, చెక్ పోస్టులు దగ్గర కచ్చితంగా చెకింగ్ జరుగుతుంది, ఎలాంటి ఈపాస్ ట్రావెల్ పాస్ లేకపోతే కచ్చితంగా ఏపీలోకి రానివ్వరు, స్పందన పోర్టర్ లో రిజిస్టర్ చేసుకున్నవారికి మాత్రమే అనుమతి ఉంటుంది.

ఇక తెలంగాణ నుంచి ఏపీకి ఎవరు రావాలి అని అనుకున్నా కచ్చితంగా అందరూ ఈపాస్ తీసుకోవాల్సిందే, సరిహద్దుల దగ్గర కచ్చితంగా చెకింగ్ జరుగుతుంది. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రకు వెళ్లేవారు ఆయా రాష్ట్రాల రిజిస్ట్రేషన్ యాప్ లో ప్రయాణ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించింది.

ఏపీ వెళ్లాల్సిన వారు స్పందన యాప్ లో, కర్ణాటకకు వెళ్లే వారు సేవా యాప్ లో, మహారాష్ట్ర వెళ్లే వారు ఆ రాష్ట్ర పోర్టల్లో నమోదు చేసుకోవాలని తెలంగాణ డీజీపీ కార్యాలయం సూచించింది. . కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే వారు మాత్రం 7 రోజులు ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్లో ఉండి టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం ఉంది.