ఏపీలో ఉప ఎన్నికలు జరిగే జిల్లాలు ఇవే

ఏపీలో ఉప ఎన్నికలు జరిగే జిల్లాలు ఇవే

0
91

ఇటీవలే తెలంగాణ హుజూర్ నగర్ ఉప ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానంలో అధికార టీఆర్ఎస్ తన జెండాను ఎగరవేసింది… అయితే ఇప్పుడు ఈ ఉపఎన్నికల వంతు ఏపీది అయింది… ఇటీవలే టీడీపీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే…

ఇక ఆయన తర్వాత త్వరలో మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసే యోచనలో ఉన్నారట… ఉత్తరాంధ్రకు అలాగే కోస్తా జిల్లాకు చెందిన ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ముందుగా టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని చూస్తున్నారట…

వీరు కానీ రాజీనామా చేస్తే రాజ్యాంగం ప్రకారం ఆరు నెలల్లో ఏపీలో ఉపఎన్నికలు వస్తాయి… ఎన్నికల్లో టీడీపీని దెబ్బకొట్టేందుకు వైసీపీ సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది… ఎందుకంటే నంద్యాల ఉపఎన్నికల్లో గాయపడిన వైసీపీ ఇదే గాయాన్ని టీడీపీకి రుచి చూపించాలని చూస్తోంది.