ఏపీలో బాలింతకు కరోనా పాజిటివ్…

ఏపీలో బాలింతకు కరోనా పాజిటివ్...

0
86

ఏపీలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది… ఈ మాయదాని మహమ్మారి ఎవ్వరిని వదలకుంది… చివరకు డాక్టర్లనుకూడా వదలకుంది… తాజాగా గుంటూరు జిల్లా సర్వజన ఆసుపత్రిలో ప్రసూతి మత్తు వైద్య విభాగల్లో పనిచేస్తున్న ఎనిమిది మంది వైద్యులు, అలాగే ఇద్దరు నర్సులు నాలుగో తరగతి సిబ్బందిని హోం క్వారంటైన్ కు తరలించారు…

గుంటూరు నగరానికి చెందిన గర్భణి ఈనెల 7న సర్వజన ఆసుపత్రిలోని ప్రసూతి విభాగానికి వచ్చింది… ప్రసవ సమయం దగ్గర పడటంతో వెంటనే ఆమెకు శస్త్ర చికిత్స చేశారు.. ప్రసవానంతరం తల్లి బిడ్డ క్షేమంగానే ఉన్నారు… అయితే అప్పటికే కరోనా వ్యాధి నిర్థారణ కోసం ఆమె సమూనాలు సేకరించారనే విషయం ఆసుపత్రిలో వైద్యులకు తెలియదు 9వ తేదీ వచ్చి నివేదికలో ఆమెకు పాజిటివ్ అని తెలింది… దీంతో ప్రసూతి మత్తు వైద్య విభాగాల్లో పని చేసే వారందనికి క్వారంటైన్ కు తలించారు…