ఏపీలో బ‌స్సు చార్జీలు పెరుగుతాయా కొత్త టాక్

ఏపీలో బ‌స్సు చార్జీలు పెరుగుతాయా కొత్త టాక్

0
78

ఇటీవ‌ల తెలంగాణ‌లో ఆర్టీసీ కార్మికులు స‌మ్మె చేశారు అంతేకాదు మొత్తానికి కొన్ని డిమాండ్లకు కేసీఆర్ ఒప్పుకున్నారు కూడా, అయితే విలీనం మాత్రం చేయ‌ము అని తేల్చిచెప్పారు, అయితే బ‌స్సు చార్జీల మోత మోగింది తెలంగాణ‌లో , ఇప్పుడు ఏపీలో కూడా చార్జీల పెంపు అనివార్యం అని తెలుస్తోంది.

ఏపీలో నాలుగేళ్ల నుంచి ఆర్టీసీ చార్జీల ధరలను పెంచలేదు. ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ రూ. 1000 కోట్ల నష్టంలో నడుస్తుండగా, దీన్ని సాధ్యమైనంత మేరకు తగ్గించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవ‌ల ప్ర‌భుత్వంలో విలీనం కూడా చేశారు దీంతో సంస్ద ముందుకు న‌డ‌వాలి అంటే రేట్లు పెంచాల్సిందే అని భావిస్తున్నార‌ట‌.

జనవరి నుంచి ప్రభుత్వమే కార్మికులకు వేతనాలు చెల్లించనుండటం, పెరిగిన డీజిల్ ధరల నేపథ్యంలో చార్జీలను పెంచే దిశగా కసరత్తు జరుగుతోందని వార్త‌లు వ‌స్తున్నాయి, అయితే దీనిపై ఇంకా వైసీపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంది…బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 70.67 నుంచి 81.08కు పెరిగింది. అయినా నష్టాలు మాత్రం తప్పడం లేదు. మ‌రి చార్జీల పెంపుపై సీఎం జ‌గ‌న్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి