ఏపీలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది…తాజాగా ఏపీ వ్యాప్తంగా మరో 34 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి… దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 473కు చేరుకుంది…. ఈ మేరకు ఆరోగ్య శాఖ ఒక ప్రకటన కూడా చేసింది…
కొత్తగా నమోదు అయిన 34 కేసుల్లో గుంటూరు జిల్లాలో అత్యధికంగా కరోనా కేసులు నమోదు అయ్యాయి… గుంటూరు జిల్లాలో 16 కృష్ణా జిల్లాలో 8 కర్నూల్ జిల్లాలో 7 అనంతపురం జిల్లాలో 2 నెల్లూరు జిల్లాలో ఒక పాజిటివ్ కేసు నమోదు అయింది…. ఇక జిల్లాల వారిగా ఎన్ని కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయంటే…
ప్రకాశం 42
విశాఖ 20
తూర్పుగోదావరి 17
పశ్చిమ గోదావరి 23
గుంటూరు 109
కృష్ణా 44
నెల్లూరు 56
కడప 31
చిత్తూరు 23
అనంతపురం 17
కర్నూల్ 91
విజయనగరం 0
శ్రీకాకుళం 0
—