తెలంగాణలో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ మాత్రమే ఏదైనా అత్యవసరం అయితే సరుకులు లేదా కూరగాయలు పాలకు వెళ్లే అవకాశం కల్పించారు.. ఆ సమయంలో మాత్రమే కిరాణా నిత్య అవసర వస్తువులు అందుబాటులో ఉంటాయి. మెడికల్ కూడా ఆ సమయంలోనే ఉంటాయి, అయితే తాజాగా ఏపీలో కూడా ఇలాంటి సమయం అమలు చేస్తున్నారు.
సరుకుల కొనుగోళ్లలో రద్దీని దృష్టిలో ఉంచుకుని సమయంలో కొంత వెసులుబాటు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే నిత్యావసర సరుకులు, కూరగాయలు, పాల విక్రయ కేంద్రాలు, రైతు బజార్లు తెరచి ఉంటాయని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి నీలం సాహ్ని వెల్లడించారు.
ఇక ఏపీలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ మెడికల్ షాపులు అందుబాటులో ఉంటాయి అని తెలిపారు. ఇక సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు జన సంచారం పూర్తిగా నిషేధిస్తున్నామన్నారు. ఏపీ అంతా ఇదే అమలు ఉంటుందని తెలిపారు. ఇక కిరాణా నిత్య అవసర వస్తువుల రవాణా ఆ వాహనాలు ఆపకండి అని వాటిని వదిలిపెట్టాలని పోలీస్ బాస్ తెలిపారు. ఇక ఏదైనా సరుకులకి వచ్చినా కేవలం కుటుంబం నుంచి ఒక్కరు మాత్రమే రావాలి అని చెబుతున్నారు.