ఏపీలో హాట్ స్పాట్ జిల్లాలు నాన్ హాట్ స్పాట్ జిల్లాలు ఇవే…

ఏపీలో హాట్ స్పాట్ జిల్లాలు నాన్ హాట్ స్పాట్ జిల్లాలు ఇవే...

0
95

మన దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు విస్తరిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం మే 3 వరకు లాక్ డౌన్ ను కొనసాగించనుంది… ఈ క్రమంలోనే కొన్ని మార్గ దర్శకాలను విడుదల చేసింది.. దేశ వ్యాప్తంగా 170 జిల్లాలను హాట్ స్పాట్ గా 207 నాన్ హాట్ స్పాట్ జిల్లాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది…

ఏపీలో హాట్ స్పాట్ జిల్లాలో ఇవే… కర్నూల్, కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాలను హాట్ స్పాట్ జిల్లాలుగా ప్రకటించింది… శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను నాన్ హాట్ స్పాట్ జిల్లాలుగా ప్రకటించింది.

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు ఈ రెండు జిల్లాలను గ్రీజ్ జోన్లుగా ప్రకటించింది.. హాట్ స్పాట్ గా గుర్తించిన జిల్లాల్లో మరో 14 రోజుల వరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాకుంటే దాన్ని ఆరెంజ్ జోన్ గా ఆతర్వాత మరో 14 రోజులు వరకు ఒక్క కేసు కూడా నమోదు కాకుంటే దాన్ని గ్రీన్ జోన్ గా ప్రకటిస్తారు..