ఏపీలో మంత్రి ప‌ద‌వుల‌కి వినిపిస్తున్న పేర్లు ఇవే

ఏపీలో మంత్రి ప‌ద‌వుల‌కి వినిపిస్తున్న పేర్లు ఇవే

0
103

ఏపీలో సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎవ‌రికి మంత్రి ప‌ద‌వులు ఇస్తారు అనేదానిపై చ‌ర్చ జ‌రుగుతోంది, ఎలాగో రెండున్న‌ర సంవ‌త్స‌రాల త‌ర్వాత మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ చేసి కొత్త‌వారికి అవ‌కాశం ఇస్తాను అన్నారు, కాని తాజాగా ఇద్ద‌రు మంత్రుల‌ని రాజ్య‌స‌భ‌కు పంప‌డంతో వారి స్ధానంలో కొత్త‌వారికి ఛాన్స్ ఇవ్వ‌నున్నారు.

ఈ నెల 22న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. రాజీనామా చేసిన ఇద్దరు బీసీ సామాజిక వర్గం కావడంతో మళ్లీ ఆ వర్గానికి చెందిన వాళ్లకే అవకాశం ఇస్తార‌ని అంటున్నారు

ఇక జిల్లాల‌ను కూడా లెక్క‌లోకి తీసుకుంటే గుంటూరు తూగో జిల్లాల నుంచి ప‌లువురి పేర్లు వినిపిస్తున్నాయి.. మోపిదేవి స్థానంలో గుంటూరు జిల్లా నుంచి విడదల రజిని పేరు వినిపిస్తోంది, బీసీ వ‌ర్గం కాబ‌ట్టి ఆమెకి ఛాన్స్ అని వార్త‌లు వ‌స్తున్నాయి, ఎమ్మెల్యే రోజా, మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆర్కే పేరు వినిపిస్తున్నాయి, తూగో నుంచి పొన్నాడ సతీష్ అలాగే కొలుసు పార్ధసారథి, ఉమ్మారెడ్డి, జోగి రమేష్ పేర్లు వినిపిస్తున్నాయి.