లాక్ డౌన్ పై కేంద్రం ఇచ్చిన సడలింపుల ప్రకారం ఏపీలో వాటిని అమలు చేస్తోంది సర్కార్, తాజాగా ఏపీ సీఎం జగన్ సర్కార్ కొన్ని సడలింపులు అయితే ఇస్తోంది, అన్నీ కూడా కేంద్రం ఇచ్చిన రూల్స్ ప్రకారమే తీసుకుంటున్నారు, ఏపీలో గ్రీన్ ఆరెంజ్ జోన్లలో బస్సులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, స్టేట్స్ తో మాట్లాడి అంతరాష్ట్ర సర్వీసులపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు.
హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై నగరాలనుంచి రావాలనుకుంటున్నవారికి బస్సులు నడపడంపై
రెండు మూడు రోజుల్లో క్లారిటీ రానుంది. బస్సులు కూడా 50 శాతం మాత్రమే నడుస్తాయి, ఇక బస్టాప్ లో మాత్రమే ప్రయాణికులు ఎక్కాలి.మధ్యలో బస్సులు ఆపరు. ఇక పాసింజర్స్ మాస్క్ ధరించాలి, బస్సుల్లో మార్కింగ్ చేయాల్సి ఉంటుంది..
ఇక దూర ప్రాంతాలకు వెళ్లే ప్రైవేటు బస్సులకూ అనుమతులు ఇవ్వాలని నిర్ణయించారు. తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాల్సిందేనన్నారు. ఇక బస్సుల్లో 20 లేదా 25 మందికి అనుమతి, వివాహాలు చేసుకుంటే 50 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు.
రెస్టారెంట్ల దగ్గర టేక్ అవే సమయంలో భౌతిక దూరం పాటించాల్సిందేనని చెప్పారు,దుకాణాలు ఉదయం 7 నుంచి సాయంత్రం ఏడు వరకూ ఉంటాయి, ఇక కాలేజీలు స్కూల్లు కోచింగ్ సెంటర్లు తీయకూడదు, సినిమాహల్స్ క్లోజ్.