ఏపీలో ఎమ్మెల్యేకి క‌రోనా టెన్ష‌న్

ఏపీలో ఎమ్మెల్యేకి క‌రోనా టెన్ష‌న్

0
94

క‌రోనా అనేది కులాలు మ‌తాలు ప్రాంతాల‌కు సంబంధం లేదు.. దీనికి పేద ధ‌నిక అనేది లేదు ఎవ‌రికి అయినా రావ‌చ్చు.. అందుకే చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి..ఇదే ప్ర‌భుత్వాలు చెబుతున్నాయి.. ట్రావెల్ హిస్ట‌రీ ఉంటే అస్స‌లు దాయ‌కూడ‌దు క‌చ్చితంగా హోం ఐసోలేష‌న్లో ఉండాల్సిందే.

అయితే తాజాగా ఏపీలో ఓ వార్త వినిపిస్తోంది, గుంటూరు జిల్లాలోని ఓ ఎమ్మెల్యేను అధికారులు ఐసోలేషన్ కు తరలించారు. ఇటీవలే ఎమ్మెల్యే బావమరిది, ఆయన భార్య ఢిల్లీకి వెళ్లొచ్చారు. వీరిద్దరికీ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. అందుకే ఆయన కూడా వారితో ఉండ‌టంతో డౌట్ వ‌చ్చి ప‌రీక్ష‌లు చేయించుకున్నార‌ట‌.

అయితే ఇటీవల వారు ఇచ్చిన విందులో పాల్గొన్నారని తెలుస్తోంది.. ఈ స‌మ‌యంలో అవ‌కాశం ఉండ‌చ్చు అని అనుమానంతో ఐసోలేష‌న్ లో ఉన్నార‌ట‌, ఎమ్మెల్యే చేసిన ప‌నికి ఆయ‌న‌ని అంద‌రూ మెచ్చుకుంటున్నారు. అయితే ఎమ్మెల్యే కుటుంబం మొత్తం ఐసోలేష‌న్ లో ఉన్నారు అని అంటున్నారు.