ఏపీలో రేషన్ కార్డులపై కొత్త రూల్స్

ఏపీలో రేషన్ కార్డులపై కొత్త రూల్స్

0
202

ఏపీ లో జగన్ సర్కారు కొత్త రేషన్ కార్డుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ చాలా మందికి రేషన్ కార్డులు మంజూరు నేతల వల్ల జరిగింది. కాని ఇప్పుడు నాయకుల సిఫార్సులు పనిచేయవు. కచ్చితంగా ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది.
తాజాగా రేషన్ కార్డు కావాలి అంటే పలు మార్పులు చేసింది ఏపీ సర్కారు, దీంతో చాలా బోగస్ కార్డులు ధనవంతుల కార్డులు కోల్పోవలసి ఉంటుంది ..గ్రామ వలంటీర్లు ఈ పనిలో నిమగ్నం అవ్వనున్నారు కేవలం పేదలకు మాత్రమే రేషన్ అందించనుంది జగన్ సర్కారు.

ఫోర్ వీలర్స్ వాహనాలు ఉన్నవారు రేషన్ కార్డుకు అనర్హులు
కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసినా వారికి వైట్ రేషన్ కార్డు రాదు
గ్రామాల్లో వార్షికాదాయం లక్షా 20 వేల రూపాయలు
పట్టణాల్లో వార్షికాదాయం లక్షా 44 వేల రూపాయలు ఉన్న కుటుంబాలు మాత్రమే రేషన్ కార్డుకు అర్హులుగా ప్రభుత్వం నిర్ణయించింది.

ఇకకొత్తగా అప్లై చేసుకునే వారు ఈ పరిమితులు చూసుకుని అప్లై చేసుకోవాలి0.. అలాగే ప్రైవేట్ ఉద్యోగాల్లో 30 వేల జీతం పైనే వచ్చినా మీరు గ్రామ వలంటీర్లకు చెప్పకపోతే మీ ఆదార్ ప్రకారం పీఎప్ అకౌంట్ల ప్రకారం ట్యాక్స్ ప్రకారం మీ ఆదాయం తెలుస్తుంది. రేషన్ కార్డులు కూడా మీకు ఇవ్వరు. సో దాని బట్టీ అప్లై చేసుకోవాలి అని చెబుతున్నారు అధికారులు.