కరోనా ఎఫెక్ట్ తో మొత్తం ప్రపంచం బాధపడుతోంది, ఇప్పుడు మన దేశం కూడా ఏప్రిల్ 14 వరకూ లాక్ అవుట్ లో ఉంది.. ఇటలీలో వచ్చిన పరిస్దితి మనకు రాకూడదు అని చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు, అయితే ఇప్పుడు ఈనెల అంతా విద్యార్దులకి పరిక్షల సమయం, ఈ సమయంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందటంతో పెద్ద ఎత్తున పరీక్షలకు ఇది పెద్ద పరీక్ష పెట్టింది.
అయితే పదో తరగతి ఇంటర్ పరీక్షలు వాయిదా వేశారు.. ఇక ప్రైమరీ సెకండరీ స్కూల్స్ కు ఒకటి నుంచి 5 వ తరగతి , అలాగే ఆరవ తరగతి నుంచి 9 వరకూ పరీక్షలు జరగాలి కాని ఏప్రిల్ 14 వరకూ లాక్ అవుట్ అంటే సిలబస్ కూడా పూర్తి కాదు.
ఇక తర్వాత పరిస్దితి ఎలా ఉంటుందో కూడా తెలియదు అందుకే ఇటీవల తమిళనాట సర్కార్ కూడా 1 నుంచి 9 వ తరగతి వరకూ నేరుగా ప్రమోట్ చేసింది, ఇక వారికి పరీక్షల రద్దు చేసింది….తాజాగా ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు పరీక్షలు రాయకుండానే పై తరగతులకు ప్రమోషన్ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. హాజరును బట్టి పై తరగతులకు వెళ్లేలా అవకాశం కల్పించారు.
అన్ని ప్రైవేట్ స్కూళ్లకు కూడా ఇది వర్తిస్తుందని స్పష్టం చేశారు.