ఏపీలో వాహ‌న‌దారుల‌కి సీఎం జ‌గ‌న్ గుడ్ న్యూస్

ఏపీలో వాహ‌న‌దారుల‌కి సీఎం జ‌గ‌న్ గుడ్ న్యూస్

0
83

ఈ కరోనాతో చాలా మంది ఇబ్బంది ప‌డ్డారు, మ‌రీ ముఖ్యంగా అన్నీరంగాలు కూడా దారుణ‌మైన స్దితికి చేరుకున్నాయి, అయితే ఇలాంటి స‌మ‌యంలో ట్యాక్సులు క‌ట్టాలి అన్నా పేమెంట్లు చేయాలి అన్నా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు జనం.

చేతిలో చిల్లిగ‌వ్వ‌లేదు ఈ స‌మ‌యంలో తాము ఎలా బ‌తికేది ఎలా ఈ కార్ట్ బిల్లులు ఈఎంఐలు చెల్లిస్తాము అని బాధ‌పడ్డారు. తాజాగా ఏపీలో వాహనదారులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది… రోడ్డు ట్యాక్స్ కట్టేందుకు గడువు పెంచాలని సీఎం జగన్ నిర్ణయించారు.

గ‌తంలో స‌ర్కారు ఇచ్చిన గ‌డువు నేటితో ముగుస్తుంది, ఈ స‌మ‌యంలో నష్టాల్లో ఉన్న ఆటో, టాక్సీ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారనే ఆలోచ‌న‌తో ట్యాక్స్ గడువు సెప్టెంబర్ నెలాఖరు వరకు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై త్వ‌ర‌లో ఉత్త‌ర్వులు జారీ చేయ‌నున్నారు.