సీఎం జగన్ ప్రమాణ స్వీకారం రోజునే వృద్ధాప్య పెన్షన్ లు, వికలాంగుల పెన్షన్ లు కూడా పెంచిన సంగతీ తెలిసిందే. పాలనలోకి వచ్చిన రోజు నుంచి ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అసెంబ్లీలో ఎన్నో సంచలన బిల్లులు పాస్ చేశారు. ఇవ్వన్నీ ప్రజా సంక్షేమం కోసమే. అయితే మొదటి సారిగా పెంచిన పింఛన్ లు జారీ చేసేందుకు ప్రభుత్వం వారం లేటు చేసింది. అయితే వారం లేటు అవుతుందని, ముందుగానే ప్రభుత్వం ప్రకటించడం వల్ల సమస్య లేకుండా పోయింది. ప్రజలు కూడా అర్ధం చేసుకున్నారు. అప్పుడు కూడా ప్రతి పక్షాలు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తూ జనాలు రెచ్చగొట్టింది. అయితే ఈ సారి కూడా పింఛన్లు నాలుగైదు రోజులు అయినా ప్రజల చేతికి అందటం లేదు.
దీనితో అసలు జగన్ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి. ఇటువంటివి పదే పదే రిపీట్ అవుతుంటే, దీనినే అదునుగా తీసుకుని ప్రతి పక్షాలు ప్రజలను రెచ్చగొడుతున్నారు. నిజానికి ఇక్కడ ప్రతిపక్షాలను అనే బదులు ప్రభుత్వం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పింఛన్లు లేటు కాకుండా ప్రభుత్వం సరైనా చర్యలు తీసుకోవాలి. అధికారులు నిర్లక్ష్యం వల్ల పింఛన్లు లేటు అవుతున్నాయా అనేది జగన్ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత .. అయిన దానికి కాని దానికి ప్రతి విషయంలో రాద్ధాంతం చేయడానికి ప్రతి పక్షం కాచుకు కూర్చుంది. అలాంటప్పుడు ప్రతి పక్షాలకు అటువంటి అవకాశాలు ఇవ్వకూడదు. అలాగే ప్రభుత్వ పధకాలు లేటు కాకుండా ప్రజలకు టైం కు చేరే విధంగా.. సరైన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం కసరత్తు చేయాలి. అధికారుల నిర్లక్ష్యం ఉంటే వారిని అదుపులో పెట్టి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాల్సిన భాద్యత ప్రభుత్వానిది.