ఈ వైరస్ లాక్ డౌన్ వేళ దాదాపు మూడు నెలలుగా బస్సులు రైళ్లు తిరగలేదు కొన్ని సర్వీసులు పరిమితంగా బస్సులు తిరుగుతున్నాయి, అవి కూడా స్టేట్ లోపల సర్వీసులు మాత్రమే, అయితే కేంద్రం అంతరాష్ట్ర సర్వీసులు నడుపుకోవచ్చు అని తెలిపింది, దీంతో అన్నీ స్టేట్స్ సమన్వయం చేసుకుని ఇలా బస్సులు నడపాలి.
అయితే తెలంగాణలో చర్చలు జరుపుతున్నారు ఏపీ ఆర్టీసీ అధికారులు, ఇక కర్ణాటక నుంచి బస్సులు నడిపేందుకు ఏపీ నుంచి కర్ణాటకకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.. ఇప్పటికే అనంతపురం డిపో నుంచి బెంగుళూరుకు సర్వీసులు ప్రారంభమయ్యాయి. చాలా నెలలుగా ఆగిన బస్సులు నేడు స్టార్ట్ అయ్యాయి.
మొదట 168 సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆ తర్వాత ప్రయాణికుల రద్దీ దృష్ట్యా నాలుగు దశల వారీగా ఐదు వందలకు బస్సు సర్వీసులను పెంచాలని నిర్ణయించారు. ఇక ఆన్ లైన్ రిజర్వేషన్ కూడాస్టార్ట్ చేస్తున్నారు. ఇక నేటి సాయంత్రం తెలంగాణ బస్సు సర్వీసులపై క్లారిటీ రానుంది.