సీఎం జగన్ ఏపీ ప్రజలకు మరిచిపోలేని గిఫ్ట్

సీఎం జగన్ ఏపీ ప్రజలకు మరిచిపోలేని గిఫ్ట్

0
86

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన తండ్రివేసిన బాటలోనే నడుస్తున్నారు… వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆరోగ్య శ్రీని ప్రారంభించి ఆరోగ్యదాతగా ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారు…

అయితే ఆయన కుమారుడు అదే రీతిలో కొనసాగిస్తున్నారు… రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీకింద ఆపరేషన్ చేయించుకున్న వారికి విశ్రాంతి సమయంలో నెలకు 5 వేలు ఆర్థిక సహయం అందిస్తామని ప్రకటించారు…

డిశ్చార్జ్ అయిన 48 గంటల్లో రోగి ఖాతాలో ఆడబ్బు జమ అవుతుందని అన్నారు.. దీనికి ప్రభుత్వానికి 265 కోట్లు ఖర్చు అవుతుందని అన్నారు…. 26 ప్రత్యేక విభాగాల్లో 836 రకాల ఆపరేషన్లకు ఆరోగ్య శ్రీ వర్తిస్తుందని అన్నారు… ఈ ఉత్తర్వులు వచ్చే నెల 1 నుంచి అమలు చేయనున్నామని తెలిపారు…