దేశంలో నేటి నుంచి అన్ లాక్ 4 అమలులోకి వచ్చింది, అయితే కేంద్రం ఇప్పటికే దీనికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదలు చేసింది, ఈ సమయంలో అంతరాష్ట్ర రవాణా ప్రయాణాలపై పూర్తిగా ఆంక్షలు తొలగించారు, దేశంలో ఎవరు ఎక్కడికి అయినా వెళ్లవచ్చు, అన్నీ జాగ్రత్తలు తీసుకుని ప్రయాణాలు చేయాలి.
సరుకు రవాణా ,ప్రయాణాలు చేయాలి అని అనుకునేవారు ఎలాంటి అనుమతి తీసుకోకుండా వెళ్లవచ్చు, అయితే ఏపీలో మాత్రం ఇప్పటి వరకూ స్పందన పోర్టల్ ద్వారా ఈ పాస్ అప్లై చేసుకుని ఏపీకి రావాలి అనే రూల్ ఉండేది, ట్రావెల్ ఈ పాస్ లేకపోతే ఏపీలోకి అనుమతించేవారు కాదు.
కాని తాజాగా ఏపీ సర్కార్ కూడా ఈపాస్ విధానం తీసేసింది..అంతర్రాష్ట్ర ప్రయాణాలు. గతంలో ఉన్న ఆంక్షల్ని ఏపీ సర్కార్ కూడా ఎత్తేసింది. గుంటూరు జిల్లాలోని పొందుగుల దగ్గర చెక్ పోస్ట్, ఇటు కృష్ణా జిల్లా బోర్డర్ దగ్గర చెక్ పోస్ట్ కర్నూలు దగ్గర ఆంక్షలు తీసేశారు. ఇక నో ఈపాస్ అయితే జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి.