జాతీయ స్థాయిలో నం.1 గా ఏపీ పోలీస్ శాఖ..వరుసగా రెండోసారి

AP Police Department No. 1 nationally for the second time in a row

0
73

పోలీస్ మరియు రక్షణ విభాగంలో ఏపీ పోలీస్ శాఖ దేశంలోనే మొదటి స్థానం సాధించింది. స్కోచ్ జాతీయ సంస్థ రాష్ట్రానికి ప్రకటించిన 56 అవార్డులలో 23 అవార్డులను ఏపీ పోలీస్ శాఖ సొంతం చేసుకుంది. వరుసగా 2020,2021లో జాతీయ స్థాయిలో సత్తా చాటి మొదటి స్థానంలో నిలిచింది. దీనితో దేశంలోనే అత్యధిక అవార్డులు (175)తో ఇతర రాష్ట్రాలకు ఏపీ పోలీస్ వారు ఆదర్శంగా నిలుస్తున్నారు.

మహిళల భద్రత, నిర్ణీత సమయంలో చార్జ్ షీట్ల దాఖలు, పోలీస్ శాఖ పరిపాలనలో పూర్తి స్థాయి డిజిటైజ్ విధానం , క్లిష్టమైన కేసులను చేదించడం, అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం విభాగాలలో అవార్డులు వచ్చాయి. వీటిలో స్వర్ణంతో పాటు ఎనిమిది రజత పతకాలతో మొత్తం 23 అవార్డులు సొంతం చేసుకున్నారు. ప్రజా సేవలో జాతీయ స్థాయిలో తమ పనితీరుతో ఆకట్టుకున్న ప్రతి ఒక్కరికీ డీజీపీ శుభాకాంక్షలు తెలిపారు.