ఏపీకి ఇప్పుడు బస్సులు ట్రైన్స్ విమానాల ద్వారా స్వగ్రామాలకు చాలా మంది చేరుకుంటున్నారు, ఈ సమయంలో వారిని కచ్చితంగా ఇంటికి నేరుగా పంపించడం లేదు, వారికి టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే ఇంటికి పంపిస్తున్నారు, వేరే స్టేట్స్ నుంచి వచ్చే ప్రయాణికులకు ముఖ్యంగా..
రైళ్లు, విమానాల్లో వచ్చే ప్రయాణికులకు 2 నిమిషాల్లోనే కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. అత్యంత సురక్షితమైన పద్ధతుల్లో గంట వ్యవధిలోనే దాదాపు 300మందికి పరీక్షలు నిర్వహించగిలిగే అధునాతన ఐ మాస్క్ క్వారంటైన్ మొబైల్ బస్సులు రాష్ట్రానికి వచ్చాయి. ఇవి విజయవాడలో ఇప్పటికే పని ప్రారంభించాయి.
వీటిలో శాంపిల్ సేకరణ యూనిట్, ఫ్రంట్‌లైన్ స్టాఫ్ సర్వైలైన్స్ ట్రాకింగ్, మెడికేషన్, హ్యాండ్ అవుట్ తదితర సదుపాయాలు ఉన్నాయి. బస్సు పక్కభాగంలో బయటకు ఉన్న రంధ్రాల దగ్గర నిలబడటానికి వీలుగా బల్లలతో మెట్లను ఏర్పాటు చేశారు. వీటి మీద ప్రయాణికులు నిలబడితే రెండు నిమషాలలోనే స్వాబ్ కలెక్షన్ పూర్తి అవుతుంది. ఈజీగా రెండు నిమిషాల్లో రిజల్ట్ చెప్పేస్తుంది.